CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Friday, May 7, 2010

కసబ్ కు ఉరి!

"భారత దేశపు వాణిజ్య రాజధాని పై మారణాయుధాలతో విరుచుకుపడి నరమేధం సృష్టించిన తీవ్రవాది కసబ్ కు ఎట్టకేలకు న్యాయ స్థానం ఉరి శిక్ష విధించింది. ఈ శిక్ష పట్ల ఎవత్ భారతావని హర్షం వ్యక్తం చేసింది." నిన్న అన్ని చానల్స్ లోను ప్రముఖంగా వినపడిన వార్త. భారత దేశపు చట్టాలను అనుసరించి ఉరి శిక్ష అన్నిటి కంటే పెద్ద్ద శిక్ష కాబట్టి, దాన్ని అమలు పరచి మనమేదో పాకిస్తాన్ పైనో తీవ్రవాదం పైనో పై చేయి సాధించాం అనుకుంటే పొరపాటే. చావుకు తెగించి చంపడానికి వచ్చిన వాడిని నొప్పి తెలీకుండా చంపి మనం సాధించింది ఏమిటో నాకు అర్ధం కావటంలేదు. మన దేశంలో ప్రజలు చట్టాలను మీరి ప్రవర్తిస్తారు తప్ప చట్టాలు మాత్రం ఎప్పుడూ వాటి పరిధి ని దాటి ప్రవర్తించవు. చివరికి అది పార్లమెంట్ మీద దాడి అయినా ముంబై తరహ దాడులు జరిపిన ఉగ్రవాదులు చేతికి చిక్కినా కూడా వీటి తీరు మారవు. సౌది లాంటి దేశాలలో మాదక ద్రవ్యాలతో పట్టుపడితేనే అక్కడ మరణ శిక్ష అమలు చేస్తారు. మనకి మాత్రం అమాయకులు నడి బజార్లో చస్తున్నా కూడా అలంటి శిక్ష వెయ్యాలంటే జంకే. పోనీ 18 నెలలు సాగిన విచారణ పూర్తి అయి అప్పుడు విధించిన శిక్ష అయినా అమలు అవుతుందా అంటే అదీ అనుమానమే. కోర్ట్ తీర్పు climax కాదు Interval మాత్రమె. ఇక అసలు డ్రామా మానవ హక్కుల సంఘాల వాళ్ళు మొదలు పెడతారు. ఒక మనిషిని ఉరి తీయటం పాపం, నేరం, అమానుషం అంటూ... వీళ్ళలో నిజంగా అంత దయ, క్షమా ఉన్నాయా లేక వాళ్ళ ఉనికిని చాటుకునే వ్యర్ధ ప్రయత్నమా? పోనీ నిజంగా వీళ్ళ ఆవేదన నిజాయితీదే అనుకున్నా, వాళ్ళ పరిధి ఈ దేశపు ఎల్లల వరేకే. ఒక మనిషిని ఉరి తీయటం పాపం, నేరం, అమానుషం అన్నcampaigning తో మన దేశంలో తీవ్రవాదాన్ని వారించే ప్రయత్నం చేయ్యోచు కాని, మన శత్రు దేశాల్లో చాటు మాటుగా నరమేధాలు సృష్టించడం లోను ఊచకోత కోయడం లో శిక్షణ పొంది పట్టాలు పుచ్చుకుని మన దేశం పైన, దేశ ప్రజల పైన పీకల దాకా ద్వేషం పెంచుకుని వచ్చి ఏ అర్ధరాత్రో ఉహించని ఉపద్రవంలా విరుచుకు పడే వారి మీద, ఈ సూక్తి ముక్తావలిలు, శాంతి సందేశాలు ఎక్కడ పనిచేస్తాయి. అవి వాళ్ళకి మన పిరికితనం లాగాను, చేతగాని తనం లాగాను కనిపిస్తాయి తప్ప.

కసబ్ పోలీసుల చేతికి చిక్కినప్పటి నుండి నిన్నటి వరకు అయినా నిర్వహణ వ్యయం 34 కోట్ల రూపాయలట. కసబ్ కి న్యాయస్థానం విధించిన శిక్ష పాకిస్తాన్ కు ఒక గుణపాఠం అని చిదంబరం గారు ఒక statement ఇచ్చి పారేసారు. అసలు ఈయన statements ఇచ్చేటప్పుడు ఏఎ లోకం లో ఉంటాడో? 18 నెల్ల క్రితమే కుక్క చావు చావవలసిన వాడిని, దేశం లోనే అత్యంత కట్టుదిట్టమనిన భద్రతా వలయం లో 18 నెలల పాటు మేపి, వాడు పాకిస్తనీయుడే అని పాకిస్తాన్ తో ఒప్పించడానికి నానా పాట్లు పడి, చివరికి విధి లేక ఉరి శిక్ష విధించానికి మనకి అయిన ఖర్చు 34 కోట్లు. 50% ప్రజలు Below poverty line కి దిగువన బ్రతుకుతున్న ఈ దేశం లో ఒక తీవ్రవాదిని తీవ్రవాది అని నిర్ధారించి ఉరి శిక్ష విధించాడానికి ఇంత అవస్థ పడాల్సి వస్తుంటే అదీ పాకిస్తాన్ కి గునపాటమా? లేక నవ్వులాటా?

ఇక చట్టాల విషయాలకి వస్తే అవి ఒక్కో దేశం లో ఒక లాగ ఉంటాయి. Law చదివే వాళ్ళ study room ఎప్పుడైనా చూసారా? ఇంత లావు పుస్తకాలు వందల్లో ఉంటాయి. అవన్నీ సామాన్యుడికి ఎప్పకి అర్ధం కాని సెక్షన్ లు, క్లాజు లూ. ఏ దేశ సగటు పౌరుడైన కోరుకొనేది న్యాయం. అదీ అన్ని వేళల చట్టం తోనే సాద్యం కాదు. నవంబర్ 26 న జరిగిన దాడులు ఈ దేశ ప్రజల పైన. అందులో చనిపోయింది ప్రజలు, అత్యధికంగా సామాన్యులు. ఆ దుర్ఘటనలో తమ వారిని పోగొట్టుకున్న భాద మాటల్లో చెప్పలేనిది. కసబ్ ని ప్రాణాలతో ఆ భాదితులకి అప్పగించడమే నా దృష్టిలో న్యాయ పూరితమైన తీర్పు. కసబ్ ని చంపాలన్నా, క్షమించాలన్నా, లేక సంస్కరించాలన్నా పూర్తి అధికారం వాళ్ళకే ఉంది.

2 comments:

Anonymous said...

Nice post... Oka avg indian heart-beat ni correct ga represent chesaru...
Mana India yeppudu maruthundho asalu.....

Traveller said...

English transalation leda?